Too Got a Good Template… To Describe about all Babus In this IT Industrry,,,,,,,,,,,,,,,,,,,,,,
This Babu will Be avilable in each and every Cubical………!!!!!!!!!!!!!!!!!
రాంబాబు ఈ మధ్యనే ఒక కాలేజీ నుండి తన బీ . టెక్ ( మెకానికల్లో అండోయ్ !) పూర్తి చేసుకుని ఒక కంసల్టెన్సీ ద్వారా బెంగుళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు . అప్పటిదాకా ఏదో సాదాసీదాగా , మామూల మనిషిలాగా గడిపేసిన రాంబాబు ఈ సఫ్ట్వేర్ కంపెనీలో ఎలాటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అన్నదే ఈవేళ్టి నా కథాంశం .
రాంబాబు వెళ్తూనే వాళ్ళ కాలేజీ సీనియర్ అయిన చందుని కలిశాడు . తన హెచ్ . ఆర్ ఓరియంటేషన్ అయ్యాక మళ్ళి కలుద్దమని అనుకున్నారు . రాంబాబు హెచ్ . ఆర్ ఓరియంటేషన్ పూర్తి చేసుకుని వచ్చాడు . చందు రాంబాబును చూస్తూనే " పద బాస్ , ఒక కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము ", అన్నాడు . ఇద్దరూ కలిసి కెఫెటీరియాకి వెళ్ళారు . అక్కడ వాళ్ళ మధ్యన సంభాషణ :
రా : ఏంటి , ఇది మెస్సా ?
చ : మెస్సు లాంటిదే , కెఫిటీరియా అంటారు రా : ఓహో , ఫుల్ మీల్స్ ఎంత , ప్లేట్ మీల్స్ ఎంత ?
చ : ( ఒక్క నిముషం ఖంగు తిని ) ఒరేయ్ బాబు , ఇక్కడ మీల్స్ ఫ్రీరా , నువ్వెంతైనా తినొచ్చు .
రా : ఆహా , మరి పార్సెల్ కూడా చేసుకోవచ్చా ?
చ : లేదు . అది కుదరదు .
రా : ఓహో , కాఫీ ఆర్డర్ ఇచ్చావా ?
చ : ఇక్కడ మనలాంటి వాళ్ళకు ఆర్డర్ చేసేవాళ్ళే కానీ , తీసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు . పద , కాఫీ మిషన్ చూపిస్తాను .
( రాంబాబు , చందు ఇద్దరూ కాఫీ తెచ్చుకుంటారు )
రా : ప్చ్ ... ఏమైనా ఫిల్టర్ కాఫీ రుచి లేదురా .
చ : అదీ దొరుకుతుంది . యాభై రూపాయలే .
రా : అబ్బే , నాకు ఫిల్టర్ కాఫీ ఇష్టం ఉండదు . ఊరికెనే పోల్చి చెప్పాను అంతే .
చ : ( వీడికి ఇంకా కుర్రదనం పోలేదు . కాలేజీకి ఎక్కువ , కార్పొరేట్ కి తక్కువ ) ఓహో .
ఇంతలో హెచ్ . ఆర్ అమ్మాయి ఒకామె వచ్చి రాంబాబుని , "How are you doing Rambabu? Do you know PCK already?" అంది . రాంబాబు ఒక విచిత్రమైన నవ్వు నవ్వి ఊరుకున్నాడు . చందు ఆమెతో , "Yes, he is from my alma mater.", అన్నాడు . దానికి ఆ అమ్మాయి , "Oh, that's fantastic. So, you are his buddy then. Do you mind taking him around the office until his manager is available to meet him?", అంది . దానికి చందు , "Oh - sure!", అన్నాడు . ఆమె నవ్వేసి , "See you around Rambabu. Have a great day!", అంది .
ఇది వింటూ పావలాకే పావుకిలో బంగారం దొరికినట్టు రాంబాబు ఒక తన్మయత్వం నిండిన ఎక్స్ప్రెషన్ పెట్టాడు . అది గమనించిన చందు , ఇలాగన్నాడు :
చ : హెల్లో బాసు . ఏమిటి సంగతి ?
రా : అబ్బే , ఏమీ లేదు .
చ : ఏదో ఉండే ఉంటుంది , చెప్పులే !
రా : ఈ అమ్మాయి నాకు పడిపోయింది .
చ : ( ఇది విని పొలమారగా తాగుతున్న కాఫీ మళ్ళి కప్పులోకే ఒంపేసి ) నీకా ఫీలింగ్ ఎందుకు వచ్చింది బాబు ?
రా : చందు , నీకు జీకే తక్కువ అనుకుంటాను . ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసు పదే పదే నవ్వుతూంటే , షేక్ హ్యాండులు ఇచ్చేస్తూ ఉంటే , " మళ్ళీ కలుద్దామని పబ్లిక్ గా " చెప్తూ ఉంటే దాని అర్థం ఏమిటి ?
చ : ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఉంటే , ఆమెకు ఇద్దరు పిల్లలు ఉంటే , ఆమె అందరినీ అలాగే పలకరిస్తుంటే దానికర్థం ఏమిటి ?
రా : ఆ ?
చ : బాబు , ఇక్కడ అమ్మాయిలు దాదాపు అందరూ ఇలాగే ఉంటూ ఉంటారు . అలాగని వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తున్నారు అని అనుకోకు . దెబ్బైపోతావు .
రా : హా ? హయ్యారే ? ఏమి ఈ పరాభవము . దీని గొంతు పిసకాలి . అవును . ఇంతకీ , ఏదో పిసికే అంటోంది ?
చ : పిసకడమా ?
రా : అదే , " హలో పిసికే " అంది ?
చ : ఓ , ఓహొ , ఓహోహో . పీ . సీ . కే , అవి నా ఇనీషియల్స్ , పి . చంద్రశేఖర కుమార్ .
రా : అలాగా . అదేదో బడ్డీ అంది . అక్కడేమైనా మిరపకాయ బజ్జీలూ అవీ అమ్ముతారా ?
చ : దేవుడా ! బడ్డీ అంటే " స్నేహితుడు " అని అర్థం .
రా : బుడ్డీ అంటే స్నేహితురాలా ?
చ : ఒరేయ్ , నన్ను ఒదిలెయ్యరా బాబు . పద నీకు ఆఫీసు చూపిస్తాను .
రా : ప్లీస్ చెప్పరా ! నువ్వు అదేదో " మటర్ " అన్నావు . ఆలూ మటర్ లాగా అదేమైనా తినుబండారమా ?
చ : వామ్మో , వాయ్యో . నీ వొకాబులరీనీ చింపెయ్య , నీ వోకల్ కార్డ్స్నీ తెంపెయ్య ! " అల్మా మటర్ " అంటే " నేను చదివి కాలేజీ ", అని అర్థం .
రా : పదా ! నిన్ను కాదు , ఆ వెంకటేశ్వర్రావుని తిట్టాలి .
చ : వాడెవడు ?
రా : మా ఇంగ్లీషు లెక్చరర్ . ఏంటొ మామూలుగా నేను చదివిన ఇంగ్లీషులో ఇవన్నీ నేర్పలేదు .
ఇద్దరూ నడుచుకుంటూ ఒక గదిలోకి వెళ్ళారు .
చ : దీనినే రిక్రియేషన్ రూం అంటారు . ఇక్కడ క్యారం బోర్డ్ , ఫూస్ బాల్ లాంటి గేమ్స్ ఆడుకోవచ్చు .
రా : బాగుంది . ఇంతకీ క్రికెట్ ఆడరా ?
చ : అప్పుడప్పుడు టీం అంతా కలిసి వెళ్ళి ఆడుకుంటాము . అది మా మ్యానేజర్ మూడ్ ని బట్టి ఉంటుంది . ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్స్ మన ఊళ్ళో లాగా ఫ్రీ కాదు . గ్రౌండ్ బుక్ చెయ్యాలి కదా . దానికి బోళ్ళంత ఖర్చు అవుతుంది .
అలాగ నడుచుకుంటూ మళ్ళీ చందు డెస్క్ దగ్గరకు వచ్చారు .
రా : ఏమిటి ఫోనా ? ఇది ఇక్కడిక్కడే పని చేస్తుందా ? లేకపోతే బయటకు కూడా చెయ్యచ్చా ?
చ : ఎక్కడికైనా చెయ్యచ్చు . నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడల్లా దీనిలోనునుండే ఫోన్ చెయ్యి . మనకెందుకు బిల్లు బొక్క ?
రా : ఓకే .
చ : ఇది మినికేఫ్ . ఇక్కడ బిస్కెట్లు , చాక్లెట్లు , కూల్డ్రింక్సు ఉంటాయి .
రా : ఇవి ఇక్కడే తినాలా ? ఇంటికి కూడా పట్టికెళ్ళచ్చా ?
చ : తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే ఇక్కడ కెమేరా ఉంటుంది . అది సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉంటారు . నిన్ను పట్టుకుని ఉద్యోగం , నీ పళ్ళు రెండూ ఊడపీకేస్తారు .
రా : ఓహో ! ఇంకా నయం ముందే అడిగాను .
చ : అది నువ్వు అడగటమే అసలు అన్యాయం అనుకో . పద , ఈ మీటింగు రూమ్లోనే మీ మ్యానేజర్తో మీటింగు . అయ్యాక కలుద్దాము .
మ్యానేజర్తో మీటింగు అయ్యాక మన రాంబాబు గుండెల్లో బాంబు పడినంత ఎక్స్ప్రెషన్తో చందు దగ్గరకు వచ్చాడు . అది చూసిన చందు :
చ : ఏమిట్రో ఆ ఫేసు ? మీ మ్యానేజర్ మొదటి రోజే డిజప్పాయింట్ చేశాడా ?
రా : ఏమిటోరా , మా మ్యానేజర్ కి కొంచెం క్రాక్ అనుకుంటాను .
చ : పిచ్చివాడా . అది మ్యానేజర్ అవ్వడానికి రిక్వయిర్మెంటురా . తెల్లకాకులు , నిజాయితీ ఉన్న రాజకీయనాయకులు , సరిగ్గా ఆలోచించే మ్యానేజర్లు ఉండరు .
రా : ఏమోరా . ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగాడు . నాకు ఏదో టెంషన్గా ఉంది .
చ : ఈ టెంషన్ తగ్గాలి అంటే ఒక కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము .
ఇద్దరూ వెళ్ళీ కాఫీలు పుచ్చుకుని కెఫిటీరియాలో కూర్చున్నారు . అప్పుడు సంభాషణ :
చ : ఇప్పుడు చెప్పు . అసలు ఏమైంది ?
రా : వస్తూనే , "Hi Rambabu. I am Ramesh Krishnan. I am your manager here.", అన్నాడు . షేఖాండ్ ఇచ్చాడు . ఇక్కడదాక బానే ఉంది .
చ : అప్పుడు
రా : "How is it going?", అన్నాడు . ఆ 'it' ఏమిటో అర్థం కాలేదు .
చ : ( కంగారు పడుతూ ) ఆహా ? మరి నువ్వేం చెప్పావు ?
రా : చాలాసేపు ఆలోచించి , నా తెలివి ఉపయోగించి , "It went down a few months ago. Slowly, it is coming up", అన్నాను .
చ : బాబు , ఒరేయ్ , ఏమిటి నువ్వు చెప్పిన "it"?
రా : చూశావా ? ఒక సంవత్సరం ఎక్స్పీరియంస్ ఉన్న నీకే అర్థం కానిది మొదట్రోజే నన్ను అడిగాడు . ఇట్ అంటే "Information Technology".
చ : ( విని దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ). అమ్మబాబోయ్ . అప్పుడు ఏమన్నాడు ?
రా : బాగా నవ్వి , "You are funny", అన్నాడు . ఆ తరువాత , "Do you care for a coffee", అన్నాడు .
చ : దానికి నువ్వేమన్నావు ?
రా : నాకు అర్థం కాలేదు . "Caring for animals", "Caring for environment", "Caring for orphans", ఇవన్నీ విన్నాను కానీ , "Caring for coffee", అని నేనెప్పుడూ వినలేదు .
చ : ఆహా నా రాజా . అప్పుడు ఏమైంది ?
రా : కాఫీ ఎంత పోతే ఎవడికి కావాలిరా ? అందుకే , " నో " అనేశాను .
చ : హమ్మయ్య . అప్పుడేమైంది ?
రా : ఆయన "I do. Let's go to cafeteria and talk", అన్నాడు . వెంటనే వెళ్ళి కాఫీ పుచ్చుకున్నాడు . నేను ఏమైన తక్కువ తిన్నానా ? నేను కూడా తీసుకున్నాను .
చ : ఓహో ! అప్పుడాయనేమన్నాడు ?
రా : "Oh - you felt like taking one?", అన్నాడు . ఎందుకు అన్నడొ అర్థం కాలేదు . నేను లైట్ తీసుకున్నాను . అప్పుడు , "What languages do you know?", అన్నాడు . నేను వెంటనే , "My mothertongue is Telugu. I speak Telangana type, kOstaa type and rayalseema type Telugu also. I know thodasa hindi and english. I learned some words like "vanakkam", "mudiyaadu", "paapom" in Tamil", అన్నాను .
చ : రామచంద్ర !
రా : ఆయనెవడు ?
చ : ఎవరోలే . ఇంతకీ ఆయనేమన్నాడు ?
రా : మళ్ళీ , "You are funny", అన్నాడు . ఈందులో జోకేమిటో నాకు అర్థం కాలేదు . అప్పుడు , "Do you know C?", అన్నాడు . నేను , "I know C. In fact, A to Z", అన్నాను .
చ : ఓహో , మనకు చమత్కారం కూడా ఉందే !
రా : మరేమనుకున్నావు . వెంటనే ఆయనకు కళ్ళూ తిరిగి అర్జునుడు భగవద్గీత వింటున్నప్పుడు కృష్ణుడిని పొగిడినట్లు పొగిడాడు నన్ను .
చ : ఏమనో ?
రా : "Great", అన్నాడు .
చ : ఇంకా ?
రా : అంతే ! మ్యానేజర్ చేత మొదటిరోజే "Great" అనిపించుకున్నాను అంటే నాకు వచ్చే నెల ప్రమోషన్ కూడా వచ్చేస్తుందేమో !
చ : వస్తుంది . నీ ఎమోషన్ చూస్తుంటే నాకు మోషన్స్ వస్తున్నాయి ముందు .
రా : చాల్లే వెటకారం . నీ జూనియర్ని అప్పుడే కంపెనీలో పేరు తెచ్చేసుకుంటున్నాను అని కోపమా ?
చ : అదే అనుకో ! ఆ తరువాత ఏమైంది ?
రా : అప్పుడు , "Did you search for a place to stay?", అన్నాడు . నేను , "I started searching", అన్నాను . దానికి , "How is it coming along?", అన్నాడు . అదేదో , అతిమూత్రవ్యధిగ్రస్తుణ్ణి డాక్టర్ అడిగినట్లు , " అదెలా వస్తోంది ", అని అడగటమేమిటో నాకు అర్థం కాలేదు . సరే , బెంగుళూరు నాకు కొత్త కదా , నీళ్ళు పడ్డాయో లేదో అని అడిగాడేమో అని , "It's coming normally", అన్నాను .
చ : ( వాంతి చేసుకున్నంత పని చేసి ). దేవుడోయ్ , నువ్వు టూ మచ్ రా ! ఆ మ్యానేజర్ ఏమయ్యాడొ పాపం .
రా : అప్పుడు నేను , "Where should I search?", అన్నాను . దానికి ఆయన , నాకు పెళ్ళైందా ? పిల్లలున్నారా ? తల్లిదండ్రులు ఎక్కడున్నారు ? లాంటి ప్రశ్నలన్నీ అడిగి "Given this condition, I would search in domalur", అన్నాడు . ఆ దోమలూర్ ఏమిటో నాకు అర్థం కాలేదు . ఐనా , నేను అడక్కుండానే నాకు ఇల్లు వెతుకుతాననడం ఒక్కటీ నాకు నచ్చింది .
చ : ఎవరన్నారు ?
రా : ఇంకెవరు ? మా మ్యానేజర్ .
చ : ఎప్పుడూ ?
రా : అదేరా , "Given this condition, I would search in domalur", అన్నారు కదా ?
చ : మహప్రభో , ఆయన వెతుకుతాను అనలేదు . దోమలూర్లో నువ్వు వెతికితే బాగుంటుంది అన్నారు .
రా : అదేమిటి ? ఆ వాక్యానికి రెన్ ఎండ్ మార్టిన్ గ్రామర్ బుక్ తిరగేసినా దాని అర్థం , " నేను వెతుకుతాను " అనే !
చ : ( ప్రయత్నాన్ని విరమించుకుని ). సరేలే బాబు . ఆయనకు మనకు నచ్చేవి నచ్చవు , మనమే వెతికేసుకుందాము . ఆయన వెతికేలోపల .
రా : అరే , మరి ఆయనకు తెలిస్తే ఫీల్ అవుతాడేమో ?
చ : నేను సర్ది చెప్పుకుంటాను మహానుభావా !
రా : సరే , మేము మాట్లాడుతుంటే మధ్యలో ఒక బుడంకాయ్ గాడూ ప్లేట్లో బజ్జీలు వేసుకుని వచ్చాడు . వెంటనే మ్యానేజర్ వాడితో ఏదో మాట్లాడుతున్నాడు . నాకస్సలు అర్థం కాలేదు .
చ : ఏమని ?
రా : మా మ్యానేజర్ ఏదో చెప్పి , "Could you do it in this month?", అన్నాడు . వెంటనే వాడు , "My plate is already full", అన్నాడు . కానీ వాడి ప్లేట్లో ఇంకా బోళ్ళు ఖాళీ ఉంది . మా మ్యానేజర్ చూసుకోవట్లేదు . మొహమాటపడుతున్నాడేమో పెద్దాయన ముందు , అని నేను , "No. Still two more bajjis will fit into this", అన్నాను .
చ : అయ్యయ్యో పరమేశ్వరా ? వాళ్ళేమన్నారు దానికి ?
రా : ఏమిటో పడి పడి నవ్వారు . మళ్ళీ అదే డయలాగు : "You are funny", అని . అప్పుడు మా మ్యానేజర్ నాకేసి చూసి , "What platforms are you used to?", అన్నాడు . ఉన్నట్టుండి వీడికి ఈ ప్లాట్ఫారం గోలేంటో అర్థం కాలేదు . EAMCET లో లాగా ప్రశ్న అర్థం కాకపోతే ఏదో ఒకటి చెప్దామని , "Number 2" అన్నాను . దానికి ఆయన నవ్వి , "Come on man, I am serious. Are you comfortable with C?", అన్నాడు . సరే ఇదేదో ఆ కన్సల్టెంట్ చెప్పిన C కోడింగ్ కి సంబంధించిన విషయం అని " యా యా ", అన్నాను .
చ : ఓహో ! అప్పుడు ?
రా : మళ్ళీ ఏదో వింత ప్రశ్న వేశాడు . "Do you have bandwidth to do what I just said?", అన్నాడు . ఉన్నట్టుండి మళ్ళీ బ్యాండ్విడ్త్ మీదకు ఎందుకు పోయాడో ! ఈవేళ అమావాస్యాయే . వీడికి అమావాస్యకి ఏమైనా పూనుతుందేమో ! అనుకుంటూనే ఉన్నాను అమావాస్యపూటా చేరడం దేనికి అని . ఆ హెచ్ . ఆర్ అమ్మాయి , "Hope to see you soon", అని పదే పదే అంటే , " చంద్రబింబం లాంటి అమ్మాయి పిలుస్తుంటే ఇంకా అమావాస్యేమిటి ", అనుకుని వచ్చేశాను . చీ నా తప్పే .
చ : బాబూ ! నీ ముహుర్తాల గోల ఆపు . ఇంతకీ ఏం చెప్పావు ?
రా : ఏముంది , "I have big bandwidth. I download new new movies, songs and softwares", అన్నాను . దానికి ఆయన నవ్వి , "You can't live without joking. Can you? Anyway, we will catch up tomorrow", అనేసి వెళ్ళిపోయాడు .
చ : new new movies ఆ ? దేవుడా !
రా : అదే కొత్త కొత్త సినిమాలు .
చ : ఒరేయ్ బాబు . నాకూ ఇంక ఓపిక లేదు . ఇంటికి పోతున్నాను .
రా : అవును . నేను కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలి . క్యాచ్చులు పట్టడం ప్రాక్టీస్ చెయ్యాలి .
చ : అది దేనికి ?
రా : మా మేనజర్ "Let us catch up tomorrow" అన్నాడుగా .
ఈ మాట విని ఏమనాలో తెలియక ఒకసారి నిట్టూర్చి చందూ వెళ్ళిపోయాడు . ఏమిటో అందరూ వింతగా ప్రవర్తిస్తున్నారు , ఇదంతా అమావాస్యప్రభావమే అని బాధపడుతూ రాంబాబు కూడా రెండు బిస్కెట్ ప్యాకెట్లు , రెండు కాఫీలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయాడు .
ఈ కథ అయిపోయింది అనుకోకండి . ఇంకా రెండో అంకం ఉంది :))