Monday, December 20, 2010

BABU from Bhimavaram to IT in Bangalore


Too Got a Good Template… To Describe  about all Babus In this IT Industrry,,,,,,,,,,,,,,,,,,,,,,
This Babu will Be avilable in each and every Cubical………!!!!!!!!!!!!!!!!!

రాంబాబు     మధ్యనే   ఒక   కాలేజీ   నుండి   తన   బీ . టెక్  ( మెకానికల్లో   అండోయ్ !) పూర్తి   చేసుకుని   ఒక   కంసల్టెన్సీ   ద్వారా   బెంగుళూరులో   ఒక   సాఫ్ట్వేర్   కంపెనీలో   ఉద్యోగం   సంపాదించాడు . అప్పటిదాకా   ఏదో   సాదాసీదాగా , మామూల   మనిషిలాగా   గడిపేసిన   రాంబాబు     సఫ్ట్వేర్   కంపెనీలో   ఎలాటి   పరిస్థితులను   ఎదుర్కొంటాడు   అన్నదే   ఈవేళ్టి   నా   కథాంశం .  

రాంబాబు   వెళ్తూనే   వాళ్ళ   కాలేజీ   సీనియర్   అయిన   చందుని   కలిశాడు . తన   హెచ్ . ఆర్   ఓరియంటేషన్   అయ్యాక   మళ్ళి   కలుద్దమని   అనుకున్నారు . రాంబాబు   హెచ్ . ఆర్   ఓరియంటేషన్   పూర్తి   చేసుకుని   వచ్చాడు . చందు   రాంబాబును   చూస్తూనే  " పద   బాస్ , ఒక   కాఫీ   తాగుతూ   మాట్లాడుకుందాము ", అన్నాడు . ఇద్దరూ   కలిసి   కెఫెటీరియాకి   వెళ్ళారు . అక్కడ   వాళ్ళ   మధ్యన   సంభాషణ :
రా : ఏంటి , ఇది   మెస్సా ?
: మెస్సు   లాంటిదే , కెఫిటీరియా   అంటారు రా : ఓహో , ఫుల్   మీల్స్   ఎంత , ప్లేట్   మీల్స్   ఎంత ?
: ( ఒక్క   నిముషం   ఖంగు   తిని ) ఒరేయ్   బాబు , ఇక్కడ   మీల్స్   ఫ్రీరా , నువ్వెంతైనా   తినొచ్చు .
రా : ఆహా , మరి   పార్సెల్   కూడా   చేసుకోవచ్చా ?
: లేదు . అది   కుదరదు .
రా : ఓహో , కాఫీ   ఆర్డర్   ఇచ్చావా ?
: ఇక్కడ   మనలాంటి   వాళ్ళకు   ఆర్డర్   చేసేవాళ్ళే   కానీ , తీసుకునే   వాళ్ళు   ఎవ్వరూ   ఉండరు . పద , కాఫీ   మిషన్   చూపిస్తాను .
(
రాంబాబు , చందు   ఇద్దరూ   కాఫీ   తెచ్చుకుంటారు )

రా : ప్చ్ ... ఏమైనా   ఫిల్టర్   కాఫీ   రుచి   లేదురా .
: అదీ   దొరుకుతుంది . యాభై   రూపాయలే .
రా : అబ్బే , నాకు   ఫిల్టర్   కాఫీ   ఇష్టం   ఉండదు . ఊరికెనే   పోల్చి   చెప్పాను   అంతే .
: ( వీడికి   ఇంకా   కుర్రదనం   పోలేదు . కాలేజీకి   ఎక్కువ , కార్పొరేట్   కి   తక్కువ ) ఓహో .
ఇంతలో   హెచ్ . ఆర్   అమ్మాయి   ఒకామె   వచ్చి   రాంబాబుని , "How are you doing Rambabu? Do you know PCK already?" అంది . రాంబాబు   ఒక   విచిత్రమైన   నవ్వు   నవ్వి   ఊరుకున్నాడు . చందు   ఆమెతో , "Yes, he is from my alma mater.", అన్నాడు . దానికి     అమ్మాయి , "Oh, that's fantastic. So, you are his buddy then. Do you mind taking him around the office until his manager is available to meet him?", అంది . దానికి   చందు , "Oh - sure!", అన్నాడు . ఆమె   నవ్వేసి , "See you around Rambabu. Have a great day!", అంది .
ఇది   వింటూ   పావలాకే   పావుకిలో   బంగారం   దొరికినట్టు   రాంబాబు   ఒక   తన్మయత్వం   నిండిన   ఎక్స్ప్రెషన్   పెట్టాడు . అది   గమనించిన   చందు , ఇలాగన్నాడు :
: హెల్లో   బాసు . ఏమిటి   సంగతి ?
రా : అబ్బే , ఏమీ   లేదు .
: ఏదో   ఉండే   ఉంటుంది , చెప్పులే !
రా :   అమ్మాయి   నాకు   పడిపోయింది .
: ( ఇది   విని   పొలమారగా   తాగుతున్న   కాఫీ   మళ్ళి   కప్పులోకే   ఒంపేసి ) నీకా   ఫీలింగ్   ఎందుకు   వచ్చింది   బాబు ?
రా : చందు , నీకు   జీకే   తక్కువ   అనుకుంటాను . ఒక   అమ్మాయి   ఒక   అబ్బాయి   చూసు   పదే   పదే   నవ్వుతూంటే , షేక్   హ్యాండులు   ఇచ్చేస్తూ   ఉంటే , "  మళ్ళీ   కలుద్దామని   పబ్లిక్   గా " చెప్తూ   ఉంటే   దాని   అర్థం   ఏమిటి ?
:   అమ్మాయికి   ఆల్రెడీ   పెళ్ళయ్యి   ఉంటే , ఆమెకు   ఇద్దరు   పిల్లలు   ఉంటే , ఆమె   అందరినీ   అలాగే   పలకరిస్తుంటే   దానికర్థం   ఏమిటి ?
రా : ?
: బాబు , ఇక్కడ   అమ్మాయిలు   దాదాపు   అందరూ   ఇలాగే   ఉంటూ   ఉంటారు . అలాగని   వాళ్ళందరూ   నిన్ను   ప్రేమిస్తున్నారు   అని   అనుకోకు . దెబ్బైపోతావు .
రా : హా ? హయ్యారే ? ఏమి     పరాభవము . దీని   గొంతు   పిసకాలి . అవును . ఇంతకీ , ఏదో   పిసికే   అంటోంది ?
: పిసకడమా ?
రా : అదే , "  హలో   పిసికే " అంది ?
: , ఓహొ , ఓహోహో . పీ . సీ . కే , అవి   నా   ఇనీషియల్స్ , పి . చంద్రశేఖర   కుమార్ .
రా : అలాగా . అదేదో   బడ్డీ   అంది . అక్కడేమైనా   మిరపకాయ   బజ్జీలూ   అవీ   అమ్ముతారా ?
: దేవుడా ! బడ్డీ   అంటే  " స్నేహితుడు " అని   అర్థం .
రా : బుడ్డీ   అంటే   స్నేహితురాలా ?
: ఒరేయ్ , నన్ను   ఒదిలెయ్యరా   బాబు . పద   నీకు   ఆఫీసు   చూపిస్తాను .
రా : ప్లీస్   చెప్పరా ! నువ్వు   అదేదో  " మటర్ " అన్నావు . ఆలూ   మటర్   లాగా   అదేమైనా   తినుబండారమా ?
: వామ్మో , వాయ్యో . నీ   వొకాబులరీనీ   చింపెయ్య , నీ   వోకల్   కార్డ్స్నీ   తెంపెయ్య ! "  అల్మా   మటర్ " అంటే  " నేను   చదివి   కాలేజీ ", అని   అర్థం .
రా : పదా ! నిన్ను   కాదు ,   వెంకటేశ్వర్రావుని   తిట్టాలి .
: వాడెవడు ?
రా : మా   ఇంగ్లీషు   లెక్చరర్ . ఏంటొ   మామూలుగా   నేను   చదివిన   ఇంగ్లీషులో   ఇవన్నీ   నేర్పలేదు .
ఇద్దరూ   నడుచుకుంటూ   ఒక   గదిలోకి   వెళ్ళారు .
: దీనినే   రిక్రియేషన్   రూం   అంటారు . ఇక్కడ   క్యారం   బోర్డ్ , ఫూస్   బాల్   లాంటి   గేమ్స్   ఆడుకోవచ్చు .
రా : బాగుంది . ఇంతకీ   క్రికెట్   ఆడరా ?
: అప్పుడప్పుడు   టీం   అంతా   కలిసి   వెళ్ళి   ఆడుకుంటాము . అది   మా   మ్యానేజర్   మూడ్   ని   బట్టి   ఉంటుంది . ఎందుకంటే   ఇక్కడ   గ్రౌండ్స్   మన   ఊళ్ళో   లాగా   ఫ్రీ   కాదు . గ్రౌండ్   బుక్   చెయ్యాలి   కదా . దానికి   బోళ్ళంత   ఖర్చు   అవుతుంది .
అలాగ   నడుచుకుంటూ   మళ్ళీ   చందు   డెస్క్   దగ్గరకు   వచ్చారు .
రా : ఏమిటి   ఫోనా ? ఇది   ఇక్కడిక్కడే   పని   చేస్తుందా ? లేకపోతే   బయటకు   కూడా   చెయ్యచ్చా ?
: ఎక్కడికైనా   చెయ్యచ్చు . నువ్వు   ఆఫీసులో   ఉన్నప్పుడల్లా   దీనిలోనునుండే   ఫోన్   చెయ్యి . మనకెందుకు   బిల్లు   బొక్క ?
రా : ఓకే .
: ఇది   మినికేఫ్ . ఇక్కడ   బిస్కెట్లు , చాక్లెట్లు , కూల్డ్రింక్సు   ఉంటాయి .
రా : ఇవి   ఇక్కడే   తినాలా ? ఇంటికి   కూడా   పట్టికెళ్ళచ్చా ?
: తీసుకెళ్ళాలని   ప్రయత్నిస్తే   ఇక్కడ   కెమేరా   ఉంటుంది . అది   సెక్యూరిటీ   వాళ్ళు   చూస్తూ   ఉంటారు . నిన్ను   పట్టుకుని   ఉద్యోగం , నీ   పళ్ళు   రెండూ   ఊడపీకేస్తారు .
రా : ఓహో ! ఇంకా   నయం   ముందే   అడిగాను .
: అది   నువ్వు   అడగటమే   అసలు   అన్యాయం   అనుకో . పద ,   మీటింగు   రూమ్లోనే   మీ   మ్యానేజర్తో   మీటింగు . అయ్యాక   కలుద్దాము .
మ్యానేజర్తో   మీటింగు   అయ్యాక   మన   రాంబాబు   గుండెల్లో   బాంబు   పడినంత   ఎక్స్ప్రెషన్తో   చందు   దగ్గరకు   వచ్చాడు . అది   చూసిన   చందు :
: ఏమిట్రో     ఫేసు ? మీ   మ్యానేజర్   మొదటి   రోజే   డిజప్పాయింట్   చేశాడా ?
రా : ఏమిటోరా , మా   మ్యానేజర్   కి   కొంచెం   క్రాక్   అనుకుంటాను .
: పిచ్చివాడా . అది   మ్యానేజర్   అవ్వడానికి   రిక్వయిర్మెంటురా . తెల్లకాకులు , నిజాయితీ   ఉన్న   రాజకీయనాయకులు , సరిగ్గా   ఆలోచించే   మ్యానేజర్లు   ఉండరు .
రా : ఏమోరా . ఏవో   పిచ్చి   పిచ్చి   ప్రశ్నలు   అడిగాడు . నాకు   ఏదో   టెంషన్గా   ఉంది .
:   టెంషన్   తగ్గాలి   అంటే   ఒక   కాఫీ   తాగుతూ   మాట్లాడుకుందాము .
ఇద్దరూ   వెళ్ళీ   కాఫీలు   పుచ్చుకుని   కెఫిటీరియాలో   కూర్చున్నారు . అప్పుడు   సంభాషణ :
: ఇప్పుడు   చెప్పు . అసలు   ఏమైంది ?
రా : వస్తూనే , "Hi Rambabu. I am Ramesh Krishnan. I am your manager here.", అన్నాడు . షేఖాండ్   ఇచ్చాడు . ఇక్కడదాక   బానే   ఉంది .
: అప్పుడు
రా : "How is it going?", అన్నాడు .  'it' ఏమిటో   అర్థం   కాలేదు .
: ( కంగారు   పడుతూ ) ఆహా ? మరి   నువ్వేం   చెప్పావు ?
రా : చాలాసేపు   ఆలోచించి , నా   తెలివి   ఉపయోగించి , "It went down a few months ago. Slowly, it is coming up", అన్నాను .
: బాబు , ఒరేయ్ , ఏమిటి   నువ్వు   చెప్పిన  "it"?
రా : చూశావా ? ఒక   సంవత్సరం   ఎక్స్పీరియంస్   ఉన్న   నీకే   అర్థం   కానిది   మొదట్రోజే   నన్ను   అడిగాడు . ఇట్   అంటే  "Information Technology".
: ( విని   దిమ్మదిరిగి   మైండ్   బ్లాక్   అయిపోయింది ). అమ్మబాబోయ్ . అప్పుడు   ఏమన్నాడు ?
రా : బాగా   నవ్వి , "You are funny", అన్నాడు .   తరువాత , "Do you care for a coffee", అన్నాడు .
: దానికి   నువ్వేమన్నావు ?
రా : నాకు   అర్థం   కాలేదు . "Caring for animals", "Caring for environment", "Caring for orphans", ఇవన్నీ   విన్నాను   కానీ , "Caring for coffee", అని   నేనెప్పుడూ   వినలేదు .
: ఆహా   నా   రాజా . అప్పుడు   ఏమైంది ?
రా : కాఫీ   ఎంత   పోతే   ఎవడికి   కావాలిరా ? అందుకే , "  నో " అనేశాను .
: హమ్మయ్య . అప్పుడేమైంది ?
రా : ఆయన  "I do. Let's go to cafeteria and talk", అన్నాడు . వెంటనే   వెళ్ళి   కాఫీ   పుచ్చుకున్నాడు . నేను   ఏమైన   తక్కువ   తిన్నానా ? నేను   కూడా   తీసుకున్నాను .
: ఓహో ! అప్పుడాయనేమన్నాడు ?
రా : "Oh - you felt like taking one?", అన్నాడు . ఎందుకు   అన్నడొ   అర్థం   కాలేదు . నేను   లైట్   తీసుకున్నాను . అప్పుడు , "What languages do you know?", అన్నాడు . నేను   వెంటనే , "My mothertongue is Telugu. I speak Telangana type, kOstaa type and rayalseema type Telugu also. I know thodasa hindi and english. I learned some words like "vanakkam", "mudiyaadu", "paapom" in Tamil", అన్నాను .
: రామచంద్ర !
రా : ఆయనెవడు ?
: ఎవరోలే . ఇంతకీ   ఆయనేమన్నాడు ?
రా : మళ్ళీ , "You are funny", అన్నాడు . ఈందులో   జోకేమిటో   నాకు   అర్థం   కాలేదు . అప్పుడు , "Do you know C?", అన్నాడు . నేను , "I know C. In fact, A to Z", అన్నాను .
: ఓహో , మనకు   చమత్కారం   కూడా   ఉందే !
రా : మరేమనుకున్నావు . వెంటనే   ఆయనకు   కళ్ళూ   తిరిగి   అర్జునుడు   భగవద్గీత   వింటున్నప్పుడు   కృష్ణుడిని   పొగిడినట్లు   పొగిడాడు   నన్ను .
: ఏమనో ?
రా : "Great", అన్నాడు .
: ఇంకా ?
రా : అంతే ! మ్యానేజర్   చేత   మొదటిరోజే  "Great"   అనిపించుకున్నాను   అంటే   నాకు   వచ్చే   నెల   ప్రమోషన్   కూడా   వచ్చేస్తుందేమో !
: వస్తుంది . నీ   ఎమోషన్   చూస్తుంటే   నాకు   మోషన్స్   వస్తున్నాయి   ముందు .
రా : చాల్లే   వెటకారం . నీ   జూనియర్ని   అప్పుడే   కంపెనీలో   పేరు   తెచ్చేసుకుంటున్నాను   అని   కోపమా ?
: అదే   అనుకో !   తరువాత   ఏమైంది ?
రా : అప్పుడు , "Did you search for a place to stay?", అన్నాడు . నేను , "I started searching", అన్నాను . దానికి , "How is it coming along?", అన్నాడు . అదేదో , అతిమూత్రవ్యధిగ్రస్తుణ్ణి   డాక్టర్   అడిగినట్లు , "  అదెలా   వస్తోంది ", అని   అడగటమేమిటో   నాకు   అర్థం   కాలేదు . సరే , బెంగుళూరు   నాకు   కొత్త   కదా , నీళ్ళు   పడ్డాయో   లేదో   అని   అడిగాడేమో   అని ,  "It's coming normally", అన్నాను .
: ( వాంతి   చేసుకున్నంత   పని   చేసి ). దేవుడోయ్ , నువ్వు   టూ   మచ్   రా !   మ్యానేజర్   ఏమయ్యాడొ   పాపం .
రా : అప్పుడు   నేను , "Where should I search?", అన్నాను . దానికి   ఆయన , నాకు   పెళ్ళైందా ? పిల్లలున్నారా ? తల్లిదండ్రులు   ఎక్కడున్నారు ? లాంటి   ప్రశ్నలన్నీ   అడిగి  "Given this condition, I would search in domalur", అన్నాడు .   దోమలూర్   ఏమిటో   నాకు   అర్థం   కాలేదు . ఐనా , నేను   అడక్కుండానే   నాకు   ఇల్లు   వెతుకుతాననడం   ఒక్కటీ   నాకు   నచ్చింది .
: ఎవరన్నారు ?
రా : ఇంకెవరు ? మా   మ్యానేజర్ .
: ఎప్పుడూ ?
రా : అదేరా , "Given this condition, I would search in domalur", అన్నారు   కదా ?
: మహప్రభో , ఆయన   వెతుకుతాను   అనలేదు . దోమలూర్లో   నువ్వు   వెతికితే   బాగుంటుంది   అన్నారు .
రా : అదేమిటి ?   వాక్యానికి   రెన్   ఎండ్   మార్టిన్   గ్రామర్   బుక్   తిరగేసినా   దాని   అర్థం , "  నేను   వెతుకుతాను " అనే !
: ( ప్రయత్నాన్ని   విరమించుకుని ). సరేలే   బాబు . ఆయనకు   మనకు   నచ్చేవి   నచ్చవు , మనమే   వెతికేసుకుందాము . ఆయన   వెతికేలోపల .
రా : అరే , మరి   ఆయనకు   తెలిస్తే   ఫీల్   అవుతాడేమో ?
: నేను   సర్ది   చెప్పుకుంటాను   మహానుభావా !
రా : సరే , మేము   మాట్లాడుతుంటే   మధ్యలో   ఒక   బుడంకాయ్   గాడూ   ప్లేట్లో   బజ్జీలు   వేసుకుని   వచ్చాడు . వెంటనే   మ్యానేజర్   వాడితో   ఏదో   మాట్లాడుతున్నాడు . నాకస్సలు   అర్థం   కాలేదు .
: ఏమని ?
రా : మా   మ్యానేజర్   ఏదో   చెప్పి , "Could you do it in this month?", అన్నాడు . వెంటనే   వాడు , "My plate is already full", అన్నాడు . కానీ   వాడి   ప్లేట్లో   ఇంకా   బోళ్ళు   ఖాళీ   ఉంది . మా   మ్యానేజర్   చూసుకోవట్లేదు . మొహమాటపడుతున్నాడేమో   పెద్దాయన   ముందు , అని   నేను , "No. Still two more bajjis will fit into this", అన్నాను .
: అయ్యయ్యో   పరమేశ్వరా ? వాళ్ళేమన్నారు   దానికి ?
రా : ఏమిటో   పడి   పడి   నవ్వారు . మళ్ళీ   అదే   డయలాగు : "You are funny", అని . అప్పుడు   మా   మ్యానేజర్   నాకేసి   చూసి , "What platforms are you used to?", అన్నాడు . ఉన్నట్టుండి   వీడికి     ప్లాట్ఫారం   గోలేంటో   అర్థం   కాలేదు . EAMCET లో   లాగా   ప్రశ్న   అర్థం   కాకపోతే   ఏదో   ఒకటి   చెప్దామని , "Number 2" అన్నాను . దానికి   ఆయన   నవ్వి , "Come on man, I am serious. Are you comfortable with C?", అన్నాడు . సరే   ఇదేదో     కన్సల్టెంట్   చెప్పిన  C కోడింగ్   కి   సంబంధించిన   విషయం   అని  " యా   యా ", అన్నాను .
: ఓహో ! అప్పుడు ?
రా : మళ్ళీ   ఏదో   వింత   ప్రశ్న   వేశాడు . "Do you have bandwidth to do what I just said?", అన్నాడు . ఉన్నట్టుండి   మళ్ళీ   బ్యాండ్విడ్త్   మీదకు   ఎందుకు   పోయాడో ! ఈవేళ   అమావాస్యాయే . వీడికి   అమావాస్యకి   ఏమైనా   పూనుతుందేమో ! అనుకుంటూనే   ఉన్నాను   అమావాస్యపూటా   చేరడం   దేనికి   అని .   హెచ్ . ఆర్   అమ్మాయి , "Hope to see you soon", అని   పదే   పదే   అంటే , "  చంద్రబింబం   లాంటి   అమ్మాయి   పిలుస్తుంటే   ఇంకా   అమావాస్యేమిటి ", అనుకుని   వచ్చేశాను . చీ   నా   తప్పే .
: బాబూ ! నీ   ముహుర్తాల   గోల   ఆపు . ఇంతకీ   ఏం   చెప్పావు ?
రా : ఏముంది , "I have big bandwidth. I download new new movies, songs and softwares", అన్నాను . దానికి   ఆయన   నవ్వి , "You can't live without joking. Can you? Anyway, we will catch up tomorrow", అనేసి   వెళ్ళిపోయాడు .
: new new movies ? దేవుడా !
రా : అదే   కొత్త   కొత్త   సినిమాలు .
: ఒరేయ్   బాబు . నాకూ   ఇంక   ఓపిక   లేదు . ఇంటికి   పోతున్నాను .
రా : అవును . నేను   కూడా   త్వరగా   ఇంటికి   వెళ్ళాలి . క్యాచ్చులు   పట్టడం   ప్రాక్టీస్   చెయ్యాలి .
: అది   దేనికి ?
రా : మా   మేనజర్  "Let us catch up tomorrow" అన్నాడుగా .
  మాట   విని   ఏమనాలో   తెలియక   ఒకసారి   నిట్టూర్చి   చందూ   వెళ్ళిపోయాడు . ఏమిటో   అందరూ   వింతగా   ప్రవర్తిస్తున్నారు , ఇదంతా   అమావాస్యప్రభావమే   అని   బాధపడుతూ   రాంబాబు   కూడా   రెండు   బిస్కెట్   ప్యాకెట్లు , రెండు   కాఫీలు   పూర్తి   చేసి   ఇంటికి   వెళ్ళిపోయాడు .

  కథ   అయిపోయింది   అనుకోకండి . ఇంకా   రెండో   అంకం   ఉంది  :))    

0 comments:

Post a Comment